Saturday 14 April 2012

దేవాలయం.

ఒకప్పుడు మహోన్నత న్యాయస్థానమూ దేవాలయమే. అందు న్యాయమంటపాలు కూడా ఉండేవి. దైవ సన్నిధిలో ప్రమాణపూర్వకంగా సత్యాన్ని అంగీకరించేవారు. అందుకు తగినశిక్ష భగవంతుని వలననే అనుభవించేవారు. అలాంటి విశ్వాసము, అనుభవములు ఉండేవి. ఆలయంలో వైద్యవిద్యకూడా ఉండేది. అది ఆదిదైవిక చికిత్సలకేకాక అర్చకులు వైదశాస్త్ర నిష్ణాతులై ఉండేవారు. అసలు ఆలయ తీర్థమే అకాల మృత్యుహరం. ప్రదక్షిణాలు రోగహరాలు. ఆలయాలు గొప్ప సేవాసదనాలుగా ఉండేవి. ఆలయములకు సమర్పింపబడిన భూములు వ్యవసాయ దారులకు ఉపాధిని కల్పిస్తూ ఉండగా వానివలన లభించే ధాన్యం ప్రసాదములకేకాక పేదల అన్నదానానికి వాడేవారు.

No comments:

Post a Comment